ప్రపంచకప్ కోసం సిద్ధంగా ఉన్నా..! అవకాశమిస్తే వద్దంటానా?..
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు జరుగుతోంది. బ్యాటింగ్ కాంబినేషన్ల నుంచి పేస్ దళంలో ఎవరెవరు ఉండాలి? అనే విషయమై అటు సెలెక్టర్లు.. ఇటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతం గంభీర్‌లు సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపత్యంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తాను ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఇరగదీస్తున్న అతడు.. మెగా టోర్నీలో ఆడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాట బయటపెట్టాడు.