హేమాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ములుగు జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 09 (బీవీకే న్యూస్):
రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం సందర్భంగా జరిగే తైలాభిషేకం కార్యక్రమంలో పాల్గోన్నారు. దర్శనం అనంతరం స్వామి వారి ఆలయ సమీపంలోని చింతామణి జలధార, ఎద్దుముక్కు ప్రాంతాలను సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల గోత్ర నామాలతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, ఆలయ చరిత్రను, శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి మహిమల గురించి భక్తులకు వివరించారు.