ఈనెల 15న ములుగు జిల్లాకు రానున్న సిఎం రేవంత్ రెడ్డి
- 16న ములుగు జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి
- సిఎం పర్యటనకు ముందు ములుగు జిల్లాలో పర్యటించనున్న డిజిపి
ములుగు జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 06 (బీవీకే న్యూస్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న ములుగు జిల్లాకు రానున్నారు.ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.15వ తేదీ సాయంత్రం మేడారం చేరుకొని,రాత్రి అక్కడే బస చేసి..మరుసటి రోజు ఉదయం వనదేవతల సన్నిధిలో పూజలు నిర్వహించి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు తెలిసింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ములుగు జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(నూతన కలెక్టరేట్ భవనం),ములుగు మండలంలోని ఇంచర్ల సమీపంలో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ములుగు శివా రులోని గట్టమ్మ సమీపంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వ ర్యంలో నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ ను సైతం ఆవిష్కరించనున్నారు. ములుగులో వాటితో పాటు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయ భవనం, తాడ్వాయి మండలం మేడారంలో ఆర్అండ్ బి అతిథి గృహం,ములుగు మండలంలోని పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, మంగపేటలో పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. తహసీల్దార్,ఐటిడిఏ ఏటూరునాగారంలో భవనం,మల్లంపల్లిలో తహశీల్దార్,ఎంపిడిఓ, ములుగులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు, హ్యామ్ పథకంలో మంజూ రైన మంగపేట-మణుగూరు, బ్రాహ్మణపల్లి - కాటాపూర్ రోడ్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.హ్యామ్ పైలాన్ మినహా మిగిలినవి అన్నీ నూతన కలెక్టరేట్ ఆవరణలోనే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకా లను సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.కాగా అందుకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా ములుగు జిల్లాలో డిజిపి సివి ఆనంద్ పర్యటన ఉంటుందని,సీఎం పర్యటనకు ముందే ఉంటుందని విశ్వసనీయ సమాచారం