🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 01 Aug, 2026 | Page: 1

*కనిపెంచిన దైవాలను కంటికి రెప్పల కాపాడు కోవాలి*

(జూలై 28_ ఆగస్టు 3 వరకు జాతీయ తల్లితండ్రుల వారోత్సవాల సందర్భంగా )
అమ్మ నాన్నలు ఆది దైవాలు
అమ్మ నాన్న లేనిది జన్మలేధు
తల్లితండ్రులే ప్రత్యక్ష దైవాలు
మన కళ్ళ ముందు కనిపించే
ప్రేమ మూర్తులు
అమ్మ జన్మ ప్రథాత
నాన్న మన భవిత విధాత
అమ్మానాన్నల ప్రేమ పవిత్రం
తల్లితండ్రులు త్యాగానికి
నిదర్శనం
అమ్మానాన్నల ప్రేమ
మందిరంలో ఎదిగే
‌సుగంధ మల్లెలే పిల్లలు
అమ్మ నడక నేర్పితే
నాన్న నడత బోధిస్తాడు
మన ఉజ్వల భవిష్యత్తుకై
అలుపెరుగని శ్రామికులు
మన బంగారు భవితకు
బాటవేసే వారు అమ్మ నాన్న
అమ్మా నాన్నలు అనాధ
ఆశ్రమాల్లో వద్దు ఆత్మీయత
ఆదరణే ముద్దు
ఆస్తుల కోసం హత్యలు వద్దు
అమ్మా నాన్నలు అనుభవాల
నిధులు మమత సమత
క్షమతకు ఆర్ధతకు అడ్డా
కార్పొరేట్ చదువులు
కరెన్సీ విలువను
పెంచిన మానవీ విలువలు
మరిచిన మమత
మంచితనానికి
తల్లితండ్రులే అంబాసిడర్లు
అనుభవాన్ని రంగరించి
ఎంచుకున్న రంగంలో
రాణింపుకు‌ ఊతంగా
నిలుస్తారు
ఎగిరెగిరి ఊళ్ళు ఏలక
పోయిన ఎవరికి
కారు భారం
అరవైలో ఇరవై కాకున్నా...
అందని ద్రాక్ష కై
అర్రులు చాచరు
ఉన్నంతలో ఉన్నతి
ఉనికిని చాటుతారు
సంతృప్తి సంతోషమే
జీవన శైలిగా
బతుకులు సాగిస్తారు
యువతకు బరోసా భద్రత
మనోనిబ్బరతను
మాటల్తో అందిస్తారు
చేతులతో ఆదరిస్తారు
కుందేళ్ళమై పరుగులు
తీయకున్నా
కూచున్న చోటే గెలుపు
బాట చూపగలరు
ధైర్యానికి పెద్ద దిక్కుగా
నిలుస్తారు
పరుగెత్తే సత్తా లేకున్నా..
జీవన పోరాటంలో
మెళుకువలు నేర్పగలరు
ఎంజాయ్ చేసే
సమయం మాకు లేకున్నా
సమయమంతా
మనకే సమర్పించే
సహనం వున్న వాళ్ళు
అనుభవ సారం
పంచుకుంటారు
మనఅభివృద్ధికి
బాట వేస్తారు
వాడిపోయే పూవులైనా కీర్తి ప్రతిష్టలు
వెదజల్లుతారు
వంశ పారంపర్యంతో
సంతానం ప్రతిష్ట పెంచే
ప్రచార కర్తలు
రాలిపోయే తారలైనా
కాంతి పుంజాలై
వెలుగు నిస్తారు
కనిపెంచిన దైవాలను
కంటికి రెప్పలా
కాపాడు కోవాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ పోరం
కరీంనగర్
9440245771
🏠 Home