🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Jul, 2026 | Page: 1

ఆరోగ్యకరమైన అలవాట్లు



ఆనందకరమైన జీవితం

(మనల్ని మనం ప్రేమించుకుందాం)

(జూలై 24 అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా)

అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం
(International self care day)
నిర్వహిస్తారు. స్వీయ సంరక్షణ గతంలో కంటే ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైంది. ఆరోగ్య ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు ఆర్థిక నేపథ్యంలో మనల్ని మనం మానసికంగా శారీరకంగా చూసుకోవడం చాలా ముఖ్యం.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ఎంత అవసరమో గుర్తు చేయడమే ఈరోజుముఖ్య ఉద్దేశం.
వారంలో ఏడు రోజులు రోజుకు 24 గంటలు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనే సందేశాన్ని ఇవ్వడమే అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవంయొక్క ముఖ్య ఉద్దేశం.
2026 సం" థీమ్ డబ్ల్యూ హెచ్ ఓ అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవానికి
స్వీయ సంరక్షణ మీ ఆరోగ్యం మీ.చేతుల్లో ఉంచుతుంది. పరీక్షించండి ట్రాక్ చేయండి వృద్ధి చెందండి అనే థీమ్ ను నిర్ణయించింది. గ్లోబల్ సెల్ఫ్ ఫెడరేషన్ సంస్థ నివారణలో ముందంజలో స్వీయ సంరక్షణ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది.
స్వీయ సంరక్షణ అంటే కేవలం విలాసవంతమైన జీవితం గడపడం .లేదా బ్యూటీ పార్లర్లకు సినిమాలకు పబ్బులకు వెళ్లడం మాత్రమే కాదు.
ఆరోగ్య పరిరక్షణ అనారోగ్యం రాకుండా మన శరీరాన్నిమనసును మనమే జాగ్రత్త చూసుకోవడం.
మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి .
మీకోసం సమయం ఇవ్వండి మీకోసం ప్రతి రోజు కొంత సమయానికిటాయించడం స్వీయ సంరక్షణ చిట్కాలలో సులభ మైనది ముఖ్యమైనది .ప్రతిరోజు కనీసం మన కోసం గంటా లేదా రెండు గంటలు సమయం కేటాయించుకోవాలి. మనం ఆనందించే పని చేయడానికి
ఈ సమయాన్ని ఉపయోగించు కోవాలి .మన మానసిక ప్రశాంతత
మన అయుఃప్రమాణాన్నీ పెంచుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఆరోగ్యంగా తినడం స్వీయ సంరక్షణ ముఖ్యమైన భాగం తాజా పండ్లు కూరగాయలు పౌష్టికాహారంతో కూడిన సమతుల ఆహారం తినడం వల్ల శక్తి సామర్థ్యాలు పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి
మంచిఆహారం సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు స్వీట్ సీతల పానీయాలు నివారిస్తే మంచిది.

బాధ్యతాయుత ప్రవర్తన వైద్యులపై ఆధారపడటం తగ్గించి రోజువారీ అలవాట్లతోనే ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం. నిద్ర ఆహారాల మధ్య సరియైన సమయాన్ని పాటించి మన ఆరోగ్యం మన చేతుల్లోనే చేతుల్లోనే ఉందనే స్పృహతో మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవాలి.
జీవనశైలి జీవన నాణ్యతను పెంచే చిన్న చిన్న మార్పులను అలవర్చుకోవడం. రోజుకు కొంత సమయం ప్రకృతిలో గడపడం
కల్తీ లేని పహారాన్ని భుజించడం. కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రకృతికి దగ్గరగా జీవించే అలవాట్లను పెంపొందించుకోవాలి.

స్వీయ సంరక్షణలోని నాలుగు ముఖ్యమైన స్తంభాలు ఈ దినోత్సవం సందర్భంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పిస్తారు. శారీరక సంరక్షణ
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా పోవాలి. పోషకాలు ఉన్న సమతుల
ఆహారం మరియు తగినంత
నీరు తీసుకోవాలి .ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం లేదా నడకఅలవాటుచేసుకోవాలి .
స్వీయ సంరక్షణలో వ్యాయామం ముఖ్యమైంది .రెగ్యులర్ వ్యాయామం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది .మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మన శరీర ఫిట్నెస్ స్థాయిని పెంచుతుంది. వాకింగ్ లేదా రన్నింగ్ ఇతర వ్యాయాయంలో పాల్గొనడంవల్ల స్నేహితులు కుటుంబ సభ్యులతో బంధాలు మరింత మెరుగుపడతాయి.
తగినంత నిద్రపోవాలి తగినంత నిద్రపోవడం మంచి ఆరోగ్యానికి కీలకం రాత్రి కచ్చితంగా7 లేదా 8 గంటలు నిద్రపోవాలి. పడుకోవడానికి ఒక గంట ముందు అని లైట్స్ ఆఫ్ చేయాలి. ఇది నిద్ర వేళకు ముందు మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకోవడానికి సహాయ పడుతుంది .
మైండ్ ఫుల్ నేస్ ప్రాక్టీస్ చేయండి మనల్ని మనం జాగ్రత్త చూసుకోవడానికి మరొక మార్గం రోజు మైండ్ ఫుల్ సాధన చేయడం. మైండ్ ఫుల్ సాధన ఒత్తిడిస్తాయిని తగ్గిస్తుంది .మన ఏకాగ్రతను మెరుగుపరిచి
సాను కుల ఆలోచనలు కలిగిస్తుంది. సానుకూల భావోద్వేగాలను పెంపొందిస్తుంది.
మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. ధ్యానము యోగ వంటివి మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఒత్తిడిని తగ్గిస్తాయి.

మానసిక సంరక్షణ మితిమీరిన ఆలోచనలు మరియు ఒత్తిడికి దూరంగా ఉండాలి .ప్రతిరోజు 10 నిమిషాల పాటు ధ్యానం లేదా ప్రాణాయామం చేయాలి. ఫోన్లు లాప్టాప్ లకు దూరంగా కాసేపు డిజిటల్ డిటెక్స్ పాటించాలి. భావోద్వేగా సంరక్షణ
మనసుకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా నో అని చెప్పడం నేర్చుకోవాలి .ఒత్తిడి పెరిగినప్పుడు కుటుంబసభ్యులతో లేదా స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి. పాత స్నేహితులతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మనసారా నవ్వుతూ గడపాలి.
పాజిటివ్ ఆలోచనలు ముద్దు ఆలోచనలు వద్దు
పాజిటివ్ ఆలోచనల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ఇతరులను భావోద్వేగాలకు గురికాకుండా చేయగలం. పాజిటివ్ ఆలోచనలు మెరుగైన సమాజ స్థాపనకు సహాయపడతాయి.
నెగెటివ్ ఆలోచనలు కలిగించే వ్యక్తులకు పరిస్థితులకు దూరంగా ఉండాలి.
ఆర్థిక సంరక్షణ భవిష్యత్తు కోసం క్రమబద్ధమైన పొదుపు అలవాట్లుచేసుకోవాలి .అత్యవసర వైద్య ఖర్చులకోసం కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. నేటి సమాజంలో స్వీయ సంరక్షణకు ఆవశ్యకత పెరిగింది ప్రస్తుత కార్పొరేట్ మరియు సాంకేతికయుగంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది తీవ్ర అలసటకు లోనవుతున్నారు. వ్యాధుల నివారణ సరైన స్వీయ సంరక్షణ వల్ల బిపి షుగర్ గుండెజబ్బులు మరియు డిప్రెషన్ వంటి సమస్యలను ముందే అరికట్టవచ్చు.
ఉత్పాదకత పెరుగుతుంది
మీ శరీరం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆఫీసులో లేదా వ్యాపారంలో సంస్థలు మెరుగుగా రాణించగలరు
సంతోషకరమైన కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోగలరు. కుటుంబ సభ్యులతో జీవిస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు
అనువైన సామాజిక వాతావరణ
సృష్టించాలి.

నిన్ను నీవు ప్రేమించుకో
నిన్ను నీవు ప్రేమించుకోకపోతే లోకంలో మరెవ్వరినీ ప్రేమించలేవు. అనేది సత్యం ఇతరుల కోసం బాధ్యతల కోసం నిరంతరం శ్రమించే మీరు మీకోసం కూడా కొంత సమయానికి కేటాయించుకోవాలి. ఈ అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవ సందర్భంగా మీ ఆరోగ్యశైలిని మార్చుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.

స్వీయ సంరక్షణ అనేది స్వార్థం కాదు అది మన బాధ్యత అంతర్జాతీయస్వియ సంరక్షణ దినోత్సవం సందర్భంగా రోజు వారి ఒత్తిడికి దూరం చేస్తూ మన శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.మనల్ని మనం ప్రేమించు కున్నపుడు ఇతరులనుకూడా ఆరోగ్యంగా చూసుకోగలమని సత్యాన్ని గుర్తిస్తూ.ఈ రోజు ఆరోగ్యకరమైన ఆనంధకరమైన రేపటికి పునాదివేద్దాం.
మెరుగైన ఆరోగ్యసమాజ నిర్మాణంతో ఆరోగ్య భారత్ అవతరణకు ఉద్యమిద్దాం


నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
మాజీ ఎన్ ఎస్ ఎస్
అధికారి
రచయిత కాలమిస్ట్
కరీంనగర్ 9440245771
🏠 Home