🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Jul, 2026 | Page: 1

కరెంటు కోతలకు నిరసనగా రైతుల ఆందోళన :

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో కరెంటు కోతలకు నిరసనగా రైతుల ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, అప్రకటిత విద్యుత్ కోతలను ఆపాలని డిమాండ్ చేశారు. అసలే వర్షాలు ఇబ్బంది పడుతుంటే కరెంట్ కోతలతో కష్టాలు రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామిన హెచ్చరించారు.
🏠 Home