🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 22 Jul, 2026 | Page: 1

ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ రిజిస్ట్రేషన్ వేళల్లో మార్పు

బీబీనగర్, జూలై 22 : ఎయిమ్స్ బీబీనగర్‌లో ఓపీడీ సేవలు పొందే రోగుల కోసం రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చేశారు. ఆగస్టు 1 నుంచి సవరించిన వేళలు అమల్లోకి రానున్నట్లు ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఇతర ఎయిమ్స్ సంస్థల్లో అమలులో ఉన్న పని వేళలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఓపీడీ రిజిస్ట్రేషన్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎయిమ్స్ యాజమాన్యం తెలిపింది. విభాగాల వారీగా కూడా ఓపీడీ సేవల రోజులను నిర్ణయించింది.

బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో;

కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలు సోమ, బుధ, శుక్రవారాల్లో;

యూరాలజీ విభాగం సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో;

మిగతా అన్ని విభాగాలు సోమవారం నుంచి శనివారం వరకు పనిచేయనున్నాయని తెలిపింది. సవరించిన రిజిస్ట్రేషన్ సమయాలను దృష్టిలో ఉంచుకుని రోగులు ఆసుపత్రికి రావాలని ఎయిమ్స్ బీబీనగర్ అధికారులు సూచించారు. ఈ మార్పులతో ఓపీడీ సేవలు మరింత క్రమబద్ధంగా సాగడంతో పాటు రోగులకు వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
🏠 Home