పిల్లలను రెచ్చగొట్టవద్దు.. వారికి సరైన మార్గాన్ని చూపండి
నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. సోమవారం జరిగిన పార్లమెంట్ మార్చ్ కూడా ఉద్రిక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) ఆ అంశంపై స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షణను అమలు చేయాలన్నారు. పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా చూసుకోవడం దేశ బాధ్యతగా భావించాలని ప్రధాని అన్నారు. ఇవాళ ఎన్డీఏ ఎంపీలతో జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన మంగల్ మిలన్ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ కోరినట్లు మంత్రి రిజిజు వెల్లడించారు.
సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఎన్డీఏ భాగస్వామ్యులు ఐక్యంగా ఉండాలని ప్రధాని చెప్పినట్లు తెలిసింది. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నా.. దేశ భవిష్యత్తు, యువత సంక్షేమ కోసం ఎంపీలు అందరూ కలిసి పనిచేయాలని మోదీ అన్నారు. చిన్న పిల్లలను రెచ్చగొట్ట వద్దు అన్నారు. వారికి సరైన దారిని చూపించాలని ప్రధాని అన్నారు. చెడు మార్గంలో వెళ్లడం సులువుగా ఉంటుందని, కానీ మళ్లీ మంచి మార్గాన్ని అనుసరించడం ఆలస్యం అవుతోందన్నారు.