🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 21 Jul, 2026 | Page: 1

కల్లు గీత అమరులను యాది చేసుకుందాం కల్లు గీత హక్కులకై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి తో పోరాడుదాం గీతన్నల రణభేరి చైతన్య బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

ములుగు జిల్లా ప్రతినిధి,
జూలై 20 (బీవీకే న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికుల కు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుండి 18 వరకు జరుగు కల్లుగీత కార్మికుల రణభేరి చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్ జిల్లాఅధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ కల్లుగీత కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున జిల్లా కేంద్రంలో ని సంఘం కార్యాలయంలో గోవిందరావుపేట మండల కార్యదర్శి వత్సవాయి సారయ్య గౌడ్ అధ్యక్షతన బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈసందర్భంగా సంఘం నాయకులునర్సయ్య గౌడ్.రవిగౌడ్ శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ ఆగస్టు 2న మహబూబాబాద్ లో కల్లుగీత కార్మికుల రణభేరి చైతన్యబస్సు యాత్ర ప్రారంభమై అన్ని జిల్లాలో యాత్ర కొనసాగుతూ18 తారీఖున హైదరాబాదులో ట్యాంక్ బండ్ దగ్గర ముగింపు బహిరంగ సభ ఉంటుందని వారు అన్నారు. ములుగు జిల్లాలో ఆగస్టు 16న ఉదయం11గంటలకు కల్లుగీత రణభేరి చైతన్య బస్సు యాత్ర ములుగు వస్తుందని ములుగు లో భారీ ర్యాలీ పంక్షన్ హాల్ ల్లో సభ జరుగుతుందనిఅన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లాలో 30 వేలకు పైన కల్లు గీత కార్మికుల కుటుంబాలు ఉన్నాయన్నారు. అన్ని సొసైటీలకు భూమి కొనుగోలు పథకం ద్వారా తాటి ఈత ఖర్జూర చెట్లు మొక్కలు పంపిణీ చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న టాడి కార్పొరేషన్ చెక్కులు మరియు ఎక్స్ గ్రేషియాలు తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఏజెన్సీలోని కల్లుగీత కార్మిక సమస్యలను ముఖ్యమంత్రి గారు తక్షణమే పరిష్కారం చేయాలని అన్నారు. వృత్తి పింఛన్ 4000 ఇవ్వాలని
10 లక్షల ఎక్స్ గ్రేషియా జీవో విడుదల చేయాలని వారు అన్నారు.జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరుగు కల్లుగీత చైతన్య రణభేరి బస్సు యాత్రను జిల్లాలోని అన్ని సొసైటీల నుండి ఇంటికి గౌడు ఊరికే వాహనంతో పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రంగు సత్యనారాయణ గౌడ్ పులి రమేష్ గౌడ్ సోషల్ మీడియా కన్వీనర్
ఉయ్యాల మధుకర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు మునిగాల సుధాకర్ గౌడ్ నక్క యాకయ్య గౌడ్ లోడే శ్రీనివాస్ గౌడ్. దొమ్మటి సదయ్య గౌడ్ మండల కార్యదర్శి గండు సదయ్య గౌడ్ సోషల్ మీడియా కన్వీనర్ బెల్లంకొండ నరేష్ గౌడ్ గోవిందరావుపేట మండల అధ్యక్షులు
రుద్రబోయిన మల్లేష్ గౌడ్ మల్లంపల్లి మండల బాధ్యులు కక్కర్ల సాంబయ్య గౌడ్ తో పాటు 25 మంది కల్లు గీత ప్రతినిధులు పాల్గొన్నారు.
🏠 Home