🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 21 Jul, 2026 | Page: 1

విధి నిర్వహణలో న్యూస్ కవర్ చేసే పాత్రికేల పై దాడి అమానుషం

- అఖిలపక్ష నిరసన కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి
నారాయణపేట, జూలై 20 (బి వి కె న్యూస్)
మాగనూరు మండలం, కృష్ణ మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక అక్రమ దోపిడీని కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్లపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడం అత్యంత దారుణం అన్నారు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి . ఈ ఘటనకు వ్యతిరేకంగా సోమవారం మాగనూరు మండల కేంద్రంలోని 167 వ జాతీయ రహదారిపై నిర్వహించిన అఖిలపక్ష ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇసుక మాఫియాకి కొమ్ము కాస్తున్న కృష్ణ మండలం SI నావిద్ ని వెంటనే సస్పెండ్ చేయాలనీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరామ్ రెడ్డి డిమాండ్ చేసారు.
అధికార బలంతో, అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకి ఇది నిదర్శనం అనీ బలరామ్ రెడ్డి అన్నారు.
🏠 Home