🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Jul, 2026 | Page: 1

హైదరాబాద్‌లో లయన్స్ క్లబ్ వైద్య సేవలకు మణికంఠ గౌడ్ కు ఘన సన్మానం

- మణికంఠ గౌడ్ అభినందించిన మక్తల్ లైన్స్ క్లబ్ సభ్యులు
నారాయణపేట, జూలై 19( బి వి కే న్యూస్ )
హైదరాబాద్‌లోని విహాన్ బ్యాంక్విట్ హాల్‌లో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A (2006-2007) ఆధ్వర్యంలో డాక్టర్స్ లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాల్లో కృషి చేసిన వైద్యులను అభినందిస్తూ హైదరాబాదులో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా సభ్యులు, వైద్యులు డాక్టర్ మణికంఠ గౌడ్‌ను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జిజ్ఞాని, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి. మహేందర్ కుమార్ రెడ్డి, అచంపేట్ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలు ఘనంగా సన్మానిస్తూ
అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో డాక్టర్ మణికంఠ గౌడ్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అధికారులు ప్రశంసించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు.
డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ....
"సమాజ సేవే మా లక్ష్యం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం మా బాధ్యత. లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తాం" అని అన్నారు.
ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అఫ్ మక్తల్ భీమా కార్యదర్శి లయన్ ఎస్ రమేష్ రావు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అఫ్ మక్తల్ బీమా అధ్యక్షులు నాగరాజ్ ట్రేసరర్ అంబదాస్, లయన్స్ క్లబ్ గత అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ ను అభినదించారు.
🏠 Home