మక్తల్ సెట్విన్ లో విద్యార్థులకు విజయవంతంగా తుది పరీక్షలు..
- హాజరైన సెట్విన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎండి ఉపేందర్ రెడ్డి
- పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు..
నారాయణపేట, జూలై 17(బివికే న్యూస్)
మక్తల్ సెట్విన్ లో మంత్రి వాకిటి శ్రీహరి చేతులమీదుగా ప్రారంభమై తొలి బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ కంప్యూటర్ ట్రైనింగ్ విద్యార్థులకు శుక్రవారం తుది దశ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు మక్తల్ సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ తెలిపారు. పరీక్షలను సెట్విన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా... సెట్విన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎండి ఉపేందర్ రెడ్డి పర్యవేక్షించారని తెలిపారు. వీరితోపాటు మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హనుమంతు స్వయంగా హాజరై పరీక్ష తీరుతనులను అడిగి తెలుసుకున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం ఇన్స్ట్రక్టర్లుగా హైదరాబాద్ నుంచి అనిత సరిత వనజ మాధవి పర్యవేక్షించారని అన్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థులకు తుది పరీక్షలతో శిక్షణ పూర్తయిందని, అతి త్వరలో వారికి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. సోమవారం నుంచి రెండో బ్యాచ్ విద్యార్థులకు శిక్షణ ప్రారంభం అవుతుందని, పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో మక్తల్ సెట్విన్ ట్రైనర్లు తిమ్మప్ప, స్వప్న, ఫర్జానా, వీరమ్మ, సిబ్బంది ప్రవీణ్, లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.