🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 17 Jul, 2026 | Page: 1

జగన్ ను మించిన మోసం-చంద్రబాబుపై షర్మిల విసుర్లు..!

పథకంలో ఈసారి భారీగా విద్యార్ధులకు కోత పెట్టడాన్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తప్పుబట్టారు. తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం" గా దీన్ని అభివర్ణించారు. ఈ విషయంలో జగన్ వారసుడు చంద్రబాబు అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. వైసీపీ మోసాల్ని తూచా తప్పకుండా పాటించడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానం అని తేల్చేశారు. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లుల్ని పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు నయవంచన చేస్తున్నారని షర్మిల విమర్శించారు. Also Read US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ - కాంగ్రెస్ కు ట్రంప్ నోటీసు..! కోతల రాయుడు కోతలని జగన్ (YS Jagan) ను ఎద్దేవా చేసిన చంద్రబాబే (Chandrababu) మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని షర్మిల ఆరోపించారు. 2023 జూన్ 29న ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు జగన్ కు సంధించిన ప్రశ్నల్ని మళ్లీ ఆయనకు గుర్తుచేశారు. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ? 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ? 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ? కారు( జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ? అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో దోపిడీనా ? అని వాటిని గుర్తుచేశారు. Recommended For You ఉప ప్రధానిగా అమిత్ షా? అప్పుడే స్వాగతిస్తూ సాయిరెడ్డి ట్వీట్..! అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏమిటని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం ? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడం ఏంటి ? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకన్నారు.

🏠 Home