బిందు సేద్యంపై నీలినీడలు
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆశించిన మేరకు దిగుబడి రావడం లేదు. కొంతమంది రైతులు కాలానికి అనుగుణంగా ఉన్న కొద్దిపాటి నీటితోనైనా ఆరుతడి పంటలను సాగు చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. అయితే బిందు సేద్యానికి ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా రైతులకు అందడం కావడం లేదు. ఆయిల్ పామ్‌ను సాగును చేసే రైతులకు మాత్రమే అధికారులు సబ్సిడీపై డ్రిప్ పరి కరాలు అందిస్తున్నారు. మిగతా పంటలైన కూర గాయలు, పండ్లతోటలు, ఆకుకూరలు, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటలకు అవసర మయ్యే బిందు సేద్యం పరికరాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పం టలకు సైతం బిందు సేద్యం పరికారులు అందిం చాలని కోరుతున్నారు.
రైతులకు చేకూరే సబ్సిడీ..
బిందు సేద్యం పథకంలో ప్రభుత్వం రాయితీపై డ్రిప్, స్ర్పింక్లర్ సెట్‌తోపాటు వివిధ పరికరాలు అం దిస్తే రైతులకు సాగులో కొంత ఆర్థికంగా ఉపయో గపడేది. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, సన్న చిన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీ పొందవచ్చు. దీంతో రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
AGRI1.2.jpgప్రైవేటుగా కొనుగోలు చేశాను..: చిలువేని నవీన్ కుమార్, రైతు, రత్నంపేట
నాకున్న ఐదెకరాల భూమిలో 30 గుంటలు వంకాయ, ఎకరన్నర బీర, మరో రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని క్యాబేజీ సాగు చేశాను. పంటల సాగు కోసం బిందు సేద్యానికి ప్రైవేటు వ్యాపా రుల వద్ద డ్రిప్ పరికరాలు కొనుగోలు చేశాను. దీంతో డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తే ఆర్థిక భారం కొంత మేరకు తగ్గేది. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు అందించాలి.