🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jul, 2026 | Page: 1

దేవరకొండ శ్రీ గరుడాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 1,16,116/- విరాళం అందించిన దాత

దేవరకొండ 16జూలై (BVK 3 న్యూస్ ) :స్థానిక గరుడాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భక్తులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో, నేడు దేవాలయ నిర్మాణానికి డాక్టర్ రమావత్ శంకర్ గారి ధర్మపత్ని శ్రీమతి విజయ ఉదారంగా రూ. 1,16,116/- విరాళాన్ని అందజేశారు. దాత దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు దాతలకు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆశించిన కార్యాలు విజయవంతం కావాలని ఆలయ కమిటీ ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు.
🏠 Home