🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jul, 2026 | Page: 1

ప్రెస్నోట్. జూలై 16 రాజేంద్రనగర్ డివిజన్ అత్తాపూర్ గోల్కొండ కోట హైదరాబాద్

గోల్కొండ బోనాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి
వి హన్మంతరావు
తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ గురువారం నాడు గోల్కొండలో శ్రీశ్రీశ్రీ జగదాంబిక అమ్మవారికి బోనం ధూప దీప నైవేద్యం సమర్పించే కార్యక్రమం జరిగింది. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాలు ఉత్సవ సమితి నిర్వహించిన కుమ్మర్ల తొలి బోనాల జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు మాజీ మంత్రి వి .హన్మంతరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనా హైదరాబాద్ గోల్కొండ బోనాలుకుమ్మర్లు అమ్మవారికి సమర్పించే కుమ్మర్ల బోనాల పండుగ సమాజంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక చైతన్యానికి ప్రతిక అని అన్నారు.అమ్మవారి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణించేట్లు శక్తి యుక్తులను సంతరించుకోవాలని మహిళా సాధికారిక ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించే సారదులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సతీమణి శ్రీమతి భట్టి నందిని మాట్లాడుతూ
అమ్మవారి దీవెనలతో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కరువు కాటకాలు తీరాలని అన్నారు. అమ్మవారికి తొలి బోనం ఎత్తే కుమ్మర్లు సమాజానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమార సంఘం 880/2014 రాష్ట్ర శాఖ అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు పత్రికా రచయిత నేదునూరి కనకయ్య అతిథిగాపాల్గొని మాట్లాడుతూ తెలంగాణ కుమ్మర్ల సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కుమ్మరి వృత్తి నైపుణ్యం కళావైభవాన్నీ చాటడంలో బోనాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అనాదిగా గోల్కొండలో అమ్మవారికి కుమ్మరికొండలో (మట్టికుండలో) అన్నం వండి కుమ్మర్లు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మట్టికుండలో బోనం శ్రేష్ఠమైనదని. శాస్త్రీయతకు పర్యావర పరిరక్షణకు ప్రజారోగ్య రక్షణకు దోహద పడుతుందని అన్నారు.
తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాలు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మగౌరవ భవన్ ఉపాధ్యక్షులు కొల్లూరు అనిల్ కుమార్ మాట్లాడుతూ
కుండ సమాజంలో శుభ కార్యక్రమాలకు దర్శనమని
"ప్రకృతే పరమాత్మ "అని ప్రకృతిలోని మట్టితో తయారు చేసిన కుండలోనే అమ్మవారికి భోజనం నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభాలు కలుగుతాయన్నారు .
తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి కోశాధికారి దామ సత్యనారాయణ మాట్లాడుతూ కుమ్మర్లను గ్రామ దేవాలయాల్లో పూజారుగా నియమించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాలు ఉత్సవ సమితి కమిటీ చైర్మెన్ శ్రీ ఆర్ కుమార్ అధ్యక్షులు ఆర్ విజయ కుమార్ ప్రేమ కుమార్ ఉపాద్యక్షులుప్రధాన కార్యదర్శి కొల్లూరి అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు కాకులారం శంకర్ రావులకొల్లు ప్రకాష్ కుమ్మరి నరసింహులు శ్రీ సిలివవేరు లాలయ్య సహాయ కార్యదర్శి కుమ్మరి రామచంద్రయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చంద్రమోహన్ రావులకొల్లు రాంకుమార్ దామా నంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్
తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి నిర్వహించిన బోనాల ఉత్సవంలో
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి వి హన్మంతరావు డిప్యూటీ సీఎం సతీమణి శ్రీమతి బట్టి నందిని టి కె ఎస్880/2014 రాష్ట్ర శాఖ అద్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య తదితరులు
నేధునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
హైదరాబాద్
9440245771
🏠 Home