🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Jul, 2026 | Page: 1

ప‌లువురికి మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పరామర్శ

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ హుస్సేన్‌ను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామంలోని ఐదో వార్డు సభ్యుడు కుర్రా వెంకట్రామయ్యను, సీపీఎం నాయకుడు షేక్ మియాలను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
🏠 Home