🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Jul, 2026 | Page: 1

దేవరకొండ మున్సిపాలిటీలో ‘జల్ సంచయ్ జన భాగీదారి 3.0’ - వర్షపు నీటి సంరక్షణపై అవగాహన సదస్సు.

దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) :
మున్సిపల్ పరిపాలనా ప్రాంతీయ సంచాలకులు (సిడిఎంఏ ) గారి ఆదేశాల మేరకు, జల శక్తి అభియాన్‌లో భాగంగా చేపట్టిన ‘జల్ సంచయ్ జన భాగీదారి 3.0’ ప్రచార కార్యక్రమంలో భాగంగా, మంగళవారం దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని వర్షపు నీటి నిల్వ గుంతల వద్ద , వర్షపు నీటిని ఒడిసి పట్టడం, భూగర్భ జలాల పునరుద్ధరణ మరియు సుస్థిర జల నిర్వహణ ఆవశ్యకతపై మున్సిపల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం, నీటిని పొదుపుగా వాడుకుంటూ, భవిష్యత్ తరాల కోసం జల సంరక్షణ చేస్తామని మున్సిపల్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ రామాదుర్గ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలని, మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురిగి శంకర్ గౌడ్ , పట్టణ ప్రణాళికా భవన పర్యవేక్షకురాలు ( టిపిబిఓ ) శ్రీమతి వర్షిత , పర్యావరణ ఇంజనీర్ శ్రీ రమావత్ సకృ నాయక్ , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home