దేవరకొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్: పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ డివిజన్ పరిధిలోని పలు కళాశాలల్లో బంద్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ , పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడడం మానుకుని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి మహా ఉద్యమాన్ని చేపట్టి, ప్రభుత్వాన్ని నిలదీస్తామనీ ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకూరి శ్రీకాంత్, నగర్ కార్యదర్శి పగిళ్ల విక్రమ్, నగర సంయుక్త కార్యదర్శి యలమల హేమ సుందర్, దమోజు అమితేష్, గుండాల శివరామరాజు, వినయ్, బిట్టు, సాయి, అబ్దుల్లా, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.