🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Jul, 2026 | Page: 1

ఓ మనిషి కోపం వద్దు ఓర్పు మౌనమే నీహద్దు కావాలి

ఓ మనిషి కోపం
బాగా వచ్చినప్పుడు
కఠినమైన మాటలు
అనవద్దు నోరు జారే
ఒక్క మాటైనా
మనసుల మధ్య దూరం
పెంచుతుంది
కోపంతో మనిషిని రగిల్చవద్దు
మాటల మంటలు రేపు వద్దు.
మనకోపమే మనకు పెద్ద శత్రువు
మన శాతమే మనకు రక్ష
కోపం తెంచును
బంధాలను అనుబంధాలను
పెంచును పగలను
ప్రతీకారాలను
ఆవేశంతో వేసే ప్రతి అడుగు
ఆలోచన లేని ఒక పరుగు
అడగకముందు వచ్చే కోపాన్ని
అణచివేస్తేనే ఉంది ప్రశాంతత
అవగాహన ఆర్థతే అభిమానానికి
ఆలంభణ కావాలి
ఆవేశం ఎక్కువ అవుతే
గట్టిగా ఒక్క శ్వాస తీసుకో
అక్కడ నుండి దూరంగా వెళ్ళి
మనసునును ప్రశాంతంగా
ఉంచుకో మనసును మార్చుకో
నీకు ఇష్టమైన పాత జ్ఞాపకాలను
తలచుకుంటుమెల్లగా నవ్వుకో
పచ్చని ప్రకృతిని చెట్లను చూస్తూ
ఆవేశాన్ని దూరం చేసుకో
స్థలాన్ని మార్చి కాసేపు నడిస్తే
కోపం మంచులా కరిగిపోతుంది
మనసును వేరే వైపు తింపితే
శాంతి నీచెంతకుచేరుతుంది
నీచింతదూరమై స్థిర చిత్తంతో
నీ మనసులో పాజిటివ్
దృక్పథంతో మనో చైతన్యం
వికసిస్తుంది
ఎదుటివారు కోపంగా
మాట్లాడుతున్నప్పుడు
నువ్వు మాత్రం మౌనంగా
ఉండు తిట్టినా తిట్టక పోయినా
కాసేపు నిశ్శబ్దంగా ఉండిపో
ఓర్పును మించిన ఆయుధం లేదు
మౌనాన్ని మించిన సమాధానం
లేదు కొన్ని సమస్యలకు కాలమే
పరిష్కారాన్ని చూపిస్తుంది
కోపమొచ్చేవేళ మౌనంగా ఉంటే
ఏసమస్యలైనా ఇట్టే గెలవచ్చు
మౌనంగా ఉండడం చేతకానితనం
కాదు అది నీకు ఉన్న పెద్దశక్తి
కోపాన్ని మౌనంతో గెలిచినప్పుడు
మాత్రమే మనసుకు నిజమైన
శాంతి దొరుకుతుంది
కోపం మనిషి విచక్షణను
కోల్పోయేలా చేస్తుంది.
ఓర్పు మౌనం అనే హద్దులు
దాటకుండా ఉంటే
ఎలాంటి క్లిష్ట పరిస్థితి నైనా
సులువుగా అధిగమించవచ్చు
ఓర్పు మార్పు తీర్పును
మౌనాన్ని మన జీవన శైలి
చేసుకుందాం
కోప రహిత సమాజాన్ని
నిర్మిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771
🏠 Home