ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరాడుతున్న విద్యార్థి నేతల అరెస్టు అప్రజాస్వామికం - బుడిగ వెంకటేష్.
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సచివాలయం శాంతియుతంగా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థి, సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని,దానిని అణిచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ,సమస్యలు పరిష్కరించామంటే విద్యార్థి సంఘం నాయకులను తెల్లవారుజామునే ఇళ్లకు వెళ్లి బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెస్తుందని విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకులను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని,ముందస్తు అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల గొంతును వినాలని,నిర్బంధ రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు.తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు.