🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Jul, 2026 | Page: 1

నిర్మల్ జిల్లాలో విషాదం..

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ కలహాలా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
🏠 Home