🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 11 Jul, 2026 | Page: 1

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ నియామకం

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ నియమితులయ్యారు.పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం,నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.​వెంకటయ్య గౌడ్ నియామకం పట్ల జిల్లాలోని పార్టీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ, వెంకటయ్య గౌడ్ కి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన నియామకం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.​ఈ సందర్భంగా ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
🏠 Home