🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 11 Jul, 2026 | Page: 1

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సిట్ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు విధించిన కఠిన నిబంధనలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలన్న షరతును సిట్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. నిరంతర వీడియో నిఘా వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.

🏠 Home