బాక్సాఫీస్ షేక్ చేసిన ‘లెనిన్’..
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సొంతం చేసుకుంది.
చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాకు ఇండియా నెట్ కలెక్షన్స్ దాదాపు రూ.5.90 కోట్లు, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.6.73 కోట్లు, అలాగే ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.3.00 కోట్లుగా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు అత్యధిక వసూళ్లు వచ్చాయని, రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ కలెక్షన్లే దాదాపు రూ.6 కోట్ల వరకు ఉన్నాయని సమాచారం. అఖిల్ కెరీర్‌లో గత చిత్రాలతో పోలిస్తే ‘లెనిన్’ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, థమన్ సంగీతంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.