🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 09 Jul, 2026 | Page: 1

విజయవంతమైన రక్తదాన శిబిరం....

రక్తదానం చేసిన 32 మంది యువకులు
నారాయణపేట, జూలై 9 (బివికె న్యూస్)
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా రక్తం నా తెలంగాణ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఎబివిపి నిర్వహించిన సేవా పోరాట కార్యక్రమాల కొనసాగింపుగా ABVP ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మఖ్తల్ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన రక్త దాన శిబిరం విజయవంతమైనది .
ఇట్టి రక్తదాన శిబిరంలో 32 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యాలయ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ
రక్తదానం ప్రాణదానంతో సమానం అని పునరుద్ఘాటించారు కొండయ్య. శరీరంలోని ప్రతి అవయవానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందించడంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుందన్నారు . అందుకే, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలంటే ప్రతి ఆరోగ్యవంతుడూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు కొండయ్య.
ఏబీవీపీ నగర అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ.....
రక్తదానం చేయండి ప్రాణదాతలుగా మారండి అని పిలుపునిచ్చారు ఆయన.
ప్రస్తుతం దేశంలో రక్త నిల్వలు చాలకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు . సకాలంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయి అంటూ తెలిపారు.
ఈ నేపథ్యంలో రక్తదానం కేవలం సేవ మాత్రమే కాకుండా, సమాజానికి చేసే గొప్ప బాధ్యతగా మారిందని అన్నారు.
యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే రక్త కొరత తగ్గే అవకాశం ఉందని తెలిపారు . ప్రతి ఆరోగ్యవంతుడు తరచూ రక్తదానం చేస్తే, అవసరంలో ఉన్న వారికి సకాలంలో సహాయం అందించి మరెన్నో జీవితాలను రక్షించవచ్చన్నారు.
రక్తదానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసిన చిన్న సహాయం, ఇంకొకరికి జీవనదానంగా మారుతుందని తెలిపారు . అందుకే “అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న” అనే మాట అక్షరసత్యం అని అన్నారు అంజిరెడ్డి .
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర , ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్,నగర కార్యదర్శి వంశీ, శరణ్,సందీప్,రమేష్, అభి, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home