రాజన్న మీ సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో ఎప్పటికీ మరువలేనివి
* ప్రజల మనసుల్లో శాశ్వత
స్థానాన్ని సంపాదించుకున్న
చిరస్మరణీయుడు డాక్టర్ వై
వైఎస్ఆర్.
* వైయస్సార్ సేవలు నిస్వార్థ ప్రజా సేవకు ఆదర్శం
* జననేత రాజన్నకు ఘన నివాళులు మంత్రి సీతక్క .
ములుగు జిల్లా ప్రతినిధి,
జూలై 08 (బీవీకే న్యూస్):
రాజన్న సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో ఎప్పటికీ మరువలేని వని, ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న చిరస్మరణీయుడని, వైయస్సార్ సేవలు నిస్వార్థ ప్రజా సేవకు ఆదర్శమని
మంత్రి సీతక్కఅన్నారు.
హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాలు అంటే కేవలం గెలుపోటములు కాదని ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడమే అసలైన విజయమని నిరూపించిన మహనీయుడనీ, అధికారం ఉన్నా
లేకున్నా ప్రజల కోసం పరితపించిన
అసలైన జననేత వైయస్సార్ అని
కొనియాడారు. జననేత ప్రజాకర్షణ
నేత డాక్టర్ గా పేరుగాంచిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం అయన తొలిసారిగా 1949 లో శాసనసభ సభ్యులు గా విజయం సాధించారు. మొత్తం గా 6 సార్లు పులివెందుల ఎమ్మెల్యే గా 4 సార్లు కడప ఎంపీ గా విజయం సాధించారు. 1980- 83 వరకు మంత్రి, 1999- 2004 వరకు శాసనసభ ప్రతిపక్షనేత గా పనిచేసిన వైస్సార్ 2003 సంవత్సరం లో రాజీవ్ పాదయాత్ర ప్రారంభించి సుమారుగా 1,500 వందల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్స్ లో అపూర్వ విజయం సాధించి అధికారం లోకి తెచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా వారి హయాంలో ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిన నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినా వెంటనే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఫైల్ పైన మొదటి సంతకం చేసిన సంఘటన గుర్తుచేస్తూ, అదేవిధంగా ఉచిత విద్యుత్ పాటుగా రాజీవ్
ఆరోగ్య శ్రీ, ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజ్ రియింబరెస్మెంట్, జలయజ్ఞం,108 అంబులెన్స్, 102, 104 మొబైల్ యూనిట్ ద్వారా గ్రామంలో ఉచిత వైద్యం, పావలా వడ్డీ కే ఋణం, పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డు లకు రెండు రూపాయలకే కీలో బియ్యం,మైనారిటీ లకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా వైస్సార్ దే అని అన్నారు. దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 02 వ తారీకు నాడు రచ్చబండ కార్యక్రమం కు వెళ్లి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదం లో వారు మరణించడం బాధకరం అని మంత్రి సీతక్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో తాడ్వాయి మండల మాజీ అధ్యక్షులు బొల్లు దేవేందర్,
జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు పెద్ది నర్సింహారావ్ తదితరులు పాల్గొన్నారు.