🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 07 Jul, 2026 | Page: 1

32 కేజీల బంగారం, 1518 కేజీల వెండి.. కానుక‌ల‌న్నీ సుర‌క్షితం

శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ ట్ర‌స్టు ఆధీనంలో సుమారు 30 కిలోల బంగారు ఐట‌మ్స్ ఉన్న‌ట్లు తెలిపింది. సుమారు 1518 కేజీల వెండి వ‌స్తువులు ఉన్న‌ట్లు ఆ ట్ర‌స్టు ట్రెజ‌ర‌ర్ స్వామి గోవింద దేవ్ గిరి తెలిపారు. అయోధ్య రామాల‌యంలో విరాళాల‌ను చోరీ చేసిన ఘ‌ట‌న‌లో 8 మంది అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఇంకా ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ది. అయితే భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాల‌ను చోరీ చేసిన‌ట్లు వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఇవాళ స్పందించింది. దేవాల‌యానికి ఇప్ప‌టి వ‌ర‌కు 2926 విలువైన వ‌స్తువుల‌ను కానుక‌లుగా స‌మ‌ర్పించార‌ని, అవ‌న్నీ సుర‌క్షితంగా ఉన్నాయ‌ని, వాటికి సంబంధించిన రికార్డుల‌ను కూడా మెయిన్‌టేన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
బంగారంతో త‌యారు చేసిన రామ‌చ‌రిత‌మాన‌స్‌, డైమండ్ నెక్లెస్ కూడా అదృశ్య‌మైన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ట్ర‌స్టు కొట్టిపారేసింది. ఆ కానుక‌ల‌ను మీడియా ముందు ప్ర‌ద‌ర్శించింది. స్వామివారికి చెందిన వెండి చ‌ర‌ణ పాదుక‌లు, కాక‌బుషుండి క‌ళాకృతి మిస్సైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్త‌ల‌ను ట్ర‌స్టు కొట్టిపారేసింది. ఆ కానుక‌ల‌ను కూడా మీడియా ముందు ట్ర‌స్టు ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌తి వ‌స్తువు వివ‌రాల‌ను ఇన్వెంట‌రీలో పొందుప‌రిచామ‌ని, ఆ వ‌స్తువును విరాళం ఇచ్చిన దాత పేరు కూడా త‌మ వ‌ద్ద ఉన్న‌ట్లు గిరి తెలిపారు.
🏠 Home