తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం.. లైంగిక దాడికి గురైన బాలిక మృతి
తూర్పు గోదావరి, జులై 7: జిల్లాలోని కొవ్వూరు మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన బసవాని లక్ష్మణ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు, నిందితుడు వరుసకు అన్నాచెల్లెలు అవుతారని సమాచారం
ఈ ఘటన అనంతరం బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సోతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.